Saturday, January 31, 2026
E-PAPER
Homeజిల్లాలుఅదనపు కలెక్టర్‌కు 'ఫామ్-ఎ' అందజేత

అదనపు కలెక్టర్‌కు ‘ఫామ్-ఎ’ అందజేత

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచనలతో రంగంలోకి బిఆర్ఎస్
నవతెలంగాణ – పరకాల 

మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) తమ వ్యూహాలకు పదును పెట్టింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ను బిఆర్ఎస్ ముఖ్య నేతలు కలిశారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ అధికారిక అభ్యర్థుల ధృవీకరణ పత్రమైన ‘ఫామ్-ఎ’ ను పార్టీ ప్రతినిధులు అధికారికంగా అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ.. పరకాల పట్టణ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని, అదే నమ్మకంతో ప్రజలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మార్గనిర్దేశనంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, పట్టణ ప్రగతిని కాంక్షించే అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నామని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస రెడ్డి, దామెర మాజీ వైస్ ఎంపీపీ జాకిర్ అలీ తదితరులు పాల్గొని అదనపు కలెక్టర్‌కు పత్రాలను సమర్పించారు. ‘ఫామ్-ఎ సమర్పణతో పరకాల పుర ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -