Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెడ్డి పేటలో పశువైద్య శిబిరం 

రెడ్డి పేటలో పశువైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని రెడ్డిపేటలో శుక్రవారం పశుసంవర్ధన శాఖ, పశు గణనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ నాగులపల్లి రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులు ఈ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల పశువైద్యాధికారి రామ్ చందర్ మాట్లాడుతూ… 11 సాధారణ చికిత్సలు, 31 గర్భకోచ వ్యాధుల చికిత్సలు, నాలుగు కృత్రిమ గర్భాధారణలు, 15 దూడలకు నట్టల నివారణ చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వీఎల్వో శ్రీనివాసరావు, సిబ్బంది నారాయణ, రమేష్, ఆంజనేయులు, బలమని, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -