- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అటవీశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు గణన కార్యక్రమంలో భాగంగా కొయ్యుర్ పారెస్ట్ రేంజ్ అధికారి ఎండి ఇక్బల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 25 వరకు మొత్తం ఆరు రోజులుగా చేపట్టినట్లుగా తెలిపారు. కొయ్యుర్ రేంజ్ పరిధిలో తాడిచెర్ల, మల్లారం,రుద్రారం నాలుగు సెక్షన్లు,8 బిట్లు ఉన్నాయి. కొయ్యుర్ రేంజ్ పరిధిలో మొత్తం 14,70 హెక్టార్లు లేదా 35 వేల పారెస్ట్ ఉంది. పారెస్ట్ అధికారులు శాఖాహర, మాంసహర జంతువుల లెక్కలను ఆన్లైన్లో నమోదు చేసినట్లుగా తెలిపారు. ఈ సర్వేను భూపాలపల్లి పారెస్ట్ డివిజన్ అధికారి పర్యవేక్షణ జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు,బిట్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



