Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని, మాజీ ప్రభుత్వ విప్పు, ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత, బి ఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జ్ పసుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో  శుక్రవారం ప్రకాష్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే  ,బంగారు తెలంగాణ కొరకు కేసిఆర్ ఎంతో కృషి చేశారన్నారు.

 ఎన్నికల సమయంలో కేటీఆర్, కెసిఆర్, హరీష్, సంతోష్ లకు సీట్ నోటీసులు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్ష ఇబ్బందుల గురిచేస్తుందన్నారు. ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో విఆర్ఐ నాయకులు కైలాస్యేశ్వర్ గౌడ్, బిఆర్ఎస్ ఆలేరు పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -