Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'శ్రీనివాస మంగాపురంలో' మంగగా..

‘శ్రీనివాస మంగాపురంలో’ మంగగా..

- Advertisement -

‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్‌ ‘శ్రీనివాస మంగాపురం’కు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కుమార్తె, ‘ఉయ్ అమ్మ’ పాటతో గుర్తింపు పొందిన రాషా థడానీ కూడా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. అశ్విని దత్‌ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండగా, ‘చందమామ కథలు’ బ్యానర్‌ పై నిర్మాత పి. కిరణ్‌ నిర్మిస్తున్నారు. టైటిల్‌ రివీల్‌, ఆకట్టుకునే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది.

శుక్రవారం ఈ చిత్రం నుంచి రాషా థడానీ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమెను ‘మంగ’ పాత్రలో పరిచయం చేశారు. సాంప్రదాయ దుస్తులలో రాషా అద్భుతంగా కనిపిస్తోంది. హుందాతనం, బలమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. మోషన్‌ పోస్టర్‌లో ఆమె ఆకట్టుకునే లుక్స్‌ ఇప్పటికే ప్రేక్షకులు, సినీ వర్గాలని అలరించాయి. ఈ చిత్రం ఇటీవల 30 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: జివి ప్రకాష్‌ కుమార్‌, డీఓపీ : జయకృష్ణ, ఎడిటర్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపాటి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాహి సురేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శాకమూరి నారాయణ స్వామి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -