– కర్నాటక నుంచి వరిగడ్డి మాటున గుట్టు చప్పుడు కాకుండా రవాణా
– నలుగురిపై కేసు నమోదు
నవతెలంగాణ-కాగజ్‌నగర్
కుమురంభీం – ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో కర్నాటక నుంచి ఐచర్ వ్యాన్‌లో రవాణా అవుతున్న నకిలీ పత్తి విత్తనాలను శనివారం టాస్క్‌ఫోర్స్, కాగజ్‌నగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలను రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి మహారాష్ట్రలోని అహేరికి చెందిన సంతోష్ కిషోర్ ద్వారా ఐచర్ వ్యాన్‌లో పత్తి విత్తనాలను కర్నాటక నుంచి కాగజ్‌నగర్‌కు తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కాగజ్‌నగర్‌లోని కాపువాడకు చెందిన కొత్తపల్లి సదాశివ్ వీటిని స్వాధీనం చేసుకొని జిల్లాలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారనే విషయం కూడా పోలీసులకు తెలియడంతో వీరు స్థానిక పెద్దవాగు వద్ద మాటు వేశారు. ఐచర్ వ్యాన్ (ఏపీ 39 టీవై 9741) రాగానే దాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో వరిగడ్డి కనిపించింది. వరిగడ్డిని తొలగించి చూడగా లోపల నకిలీ పత్తి విత్తనాల బ్యాగ్‌లు కనిపించాయి. రూ.60లక్షల విలువ కలిగిన 20క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తీసుకోవడానికి అక్కడికి వచ్చిన కొత్తపల్లి సదాశివ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపల్లి సదాశివ్‌తో పాటు సంతోష్ కిషోర్, ఐచర్ వ్యాన్ డ్రైవర్ పుప్పాల లక్ష్మణ్ (ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని వాసి)ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన వేణుగోపాల్‌రెడ్డి (రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ వాసి) పరారీలో ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు. భారీ మొత్తంలో ప్రభుత్వ నిషేధిత నకిలీ బీటీ పత్తి విత్తనాలు పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్‌ఐ వెంకటేష్‌తో పాటు సిబ్బంది, కాగజ్‌నగర్ రూరల్ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, కాగజ్‌నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ సందీప్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ వెంకటేష్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మధు, రమేష్, మైమూద్, దేవేందర్, సంజీవ్, హోంగార్డు శేఖర్ పాల్గొన్నారు.
20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES