Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు పెద్ద సంఖ్యలో పేషెంట్లు

ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు పెద్ద సంఖ్యలో పేషెంట్లు

- Advertisement -

మంత్రి వివేక్‌ వెంకటస్వామి నేతృత్వంలో క్యాంపు నిర్వాహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర ఈఎస్‌ఐ, బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి మార్గదర్శకత్వలో జీడిమెట్ల ఈఎస్‌ఐ ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు పెద్ద సంఖ్యలో పేషెంట్లు హాజరయ్యారు. ఈ స్క్రీనింగ్‌ శిబిరానికి మొత్తం 231 మంది ఇన్సూర్డ్‌ పర్సన్స్‌ హాజరుకాగా, అందులో 154 మంది మహిళలు, 77 మంది పురుషులు ఉన్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి ఆరుగురు ఆంకాలజీ నిపుణులు, ఈఎస్‌ఐ నుంచి 10 మంది వైద్యులు శిబిరాన్ని పర్యవేక్షించారు. స్క్రీనింగ్‌లో భాగంగా ఎక్స్‌-రే, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌ సోనోగ్రఫీ, పాప్‌స్మియర్‌ తదితర పరీక్షలు నిర్వహించారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌ఐకి చెందిన అన్ని ఇన్సూర్డ్‌ పర్సన్స్‌కు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఈఎస్‌ఐ, బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ మధ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -