నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలతో పాటు ఏడు నుంచి పదవ తరగతిలో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరవ తరగతి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఏడు నుంచి పదవ తరగతిలో ప్రవేశాల కోసం పరీక్షను నిర్వహిం చనున్నారు.
దరఖాస్తులను ఫిబ్రవరి 28 వరకు http://www.tgms.telangana.gov.in సమర్పించాలి. ఒసీ విద్యార్థులకు రూ.200, మిగిలిన విద్యార్థులకు రూ.125గా పరీక్ష ఫీజును నిర్ణయించారు.
పాఠశాల ప్రాంగణంలోనే ఆధార్ అప్‌డేట్
విద్యార్థులు ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా స్కూల్ ప్రాంగణాల్లోనే కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఐదేండ్లలోపు ఆధార్ తీసుకున్న వారు తప్పనిసరిగా వారి బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యునిక్ ఐడెంటిపికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) డైరెక్టర్ భారతితో పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ సమావేశమై చర్చించారు. ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిం చేందుకు వీలుగా మొబైల్ కేంద్రాలు పని చేస్తాయని వారు తెలిపారు. విద్యార్థులు ఫిబ్రవరి నెలలోపు ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని కోరారు. ఈ దిశగా మండల విద్యాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని నికోలస్ సూచించారు. ఆధార్ ఆధారంగా విద్యార్థులకు లభించే సేవలకు విఘాతం కలగకుండా వెంటనే అప్‌డేట్ చేయించాలన్నారు.
మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు పరీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



