న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన పేరిణి శివతాండవం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. శుక్రవారం ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్‌లో, జ్ఞాన్‌పథ్ వద్ద తెలంగాణకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2026’లో భాగంగా పేరిణి నత్యాన్ని ప్రదర్శించారు. యుద్ధభూమికి వెళ్ళే ముందు శివుని గౌరవార్థం ఉత్సాహాంగా ప్రదర్శించడం వల్ల దీనిని ‘యోధుల నత్యం’ అని కూడా పిలుస్తారు. సుమారు 800 సంవత్సరాల నాటి ఈ పేరిణి నత్య రూపం కాకతీయ రాజవంశం సమయంలో తెలంగాణలో ఉద్భవించి అభివద్ధి చెందింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా జ్ఞాన్‌పథ్ వద్ద ప్రతి ఏడాది సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాంస్కతిక శాఖ నేతత్వంలో కళాకారులు ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ వీక్షించి, కళాకారులను అభినందించారు.
మంత్ర ముగ్ధులను చేసిన ”పేరిణి నత్యం”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



