010 పద్దు ద్వారా వేతనాలివ్వాలి : చావ రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మోడల్ స్కూల్స్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఎస్ యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌లు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌ఎంఎస్ టీఎఫ్) క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ 010 పద్దు ద్వారా వేతనాలివ్వాలని కోరారు. అలాగే టీజీటీలకు, జూలై 2013లో జాయినైన పీజీటీలకు నోషనల్ సర్వీస్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బి.కొండయ్య, ప్రధాన కార్యదర్శి డా.సిల్వేరు మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రావు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్స్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



