– ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
న్యూఢిల్లీ : కార్మిక సంఘాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక వద్ధి మందగమనానికి కార్మిక సంఘాలే కారణమంటూ సీజేఐ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కార్మికుల హక్కుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయమని పేర్కొన్నారు. దేశంలోని కోట్లాది మంది అసంఘటిత, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన రాజ్యాంగ పదవిలో ఉన్న వారు, కార్పొరేట్ శక్తుల భాషలో మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకున్నప్పుడు, కోర్టులు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు కషి చేసిన గత సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. వాస్తవానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కోర్టు స్పందిస్తుందని ఆశించామని, కానీ అలా జరగకపోగా, కార్మిక సంఘాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం విచారకరమని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను తక్షణమే పున్ణపరిశీలించి, గ్రామీణ పేదల పక్షాన నిలవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఫల్యాలను ప్రశ్నించాలని కోరారు.
సీజేఐ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు బలం
- Advertisement -
- Advertisement -



