కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి హాజరు
సిట్ నోటీసులు, మున్సిపల్ ఎన్నికలపై చర్చ
నవతెలంగాణ-మర్కుక్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై నేతల మధ్య చర్చ జరుగుతున్నట్టు ఆపార్టీ శ్రేణుల సమాచారం. ఇదే విషయమై గురువారం కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ అయిన విషయం తెలిసిందే. సిట్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిన అంశాలు, అడిగే ప్రశ్నలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాధానాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిట్ నివేదిక వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నోటీసులను ఎలా ఎదుర్కోవాలి.. పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయాలపై సమాలోచన జరిగినట్టు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ వైఖరి, ఇతర పార్టీల ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన వ్యూహాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన రాజకీయ అడుగులు, ప్రజా ఉద్యమాల రూపకల్పన, మీడియా ముందుకు వెళ్లాల్సిన అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.
ఎర్రవల్లిలో ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



