– కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
– హనుమకొండ డీసీసీ భవన్లో గాంధీ వర్ధంతి
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
గాంధీజీ చూపిన మార్గమే నేటి సమాజానికి దిశానిర్దేశకమని, ఆయన సిద్ధాంతాలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన నివాళి అవుతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండలోని డీసీసీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘సర్వోదయ చరక సంఘటన్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. సత్యం, అహింస, స్వదేశీ, సర్వోదయం వంటి మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చరక అభ్యాస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. నూలు వడకడం ద్వారా స్వావలంబన, స్వదేశీ భావన ప్రాముఖ్యతను వివరించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలను విధానంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయూబ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మెన్ ఈరవత్రి అనిల్ కుమార్, రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్ రావు, దుద్దిళ్ల శ్రీనుబాబు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్ రావు, జాతీయ కో ఆర్డినేటర్ పులి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నేటి తరానికి దిశానిర్దేశం గాంధీ మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



