- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బోండా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందాడు. రహ్మత్‌నగర్ ఎస్.పి.ఆర్ హిల్స్‌కి చెందిన దాసరి రమేష్ (45) లారీ డ్రైవర్. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో యూసుఫ్‌గూడ శ్రీకృష్ణదేవరాయనగర్ సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద బోండాలు తింటుండగా గొంతులో ఇరుక్కుని ఊపిరాడక కుప్పకూలాడు. శుక్రవారం స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా రమేష్ మృతి చెంది ఉన్నాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
- Advertisement -



