- Advertisement -
-జెడ్పిసీఈవో గౌతమ్ రెడ్డి
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ముగిసిన నేపథ్యంలో,శనివారం నామినేషన్ పత్రాల పరిశీలనను రిటర్నింగ్ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నామినేషన్ల పరిశీలన కేంద్రాన్ని జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి (జెడ్పిసీఈవో) గౌతమ్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. వార్డుల వారీగా నామినేషన్ పత్రాల పరిశీలనను క్షుణ్ణంగా తనిఖీ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కె.నాగరాజు, మేనేజర్ వెంకటి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



