నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మద్నూర్ ఎంపీడీవో రాణి కృషి అభినందనీయమని మండల ప్రజలు ఎంపీడీవో విధుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో మద్నూర్ మండలం మొదట స్థానాన్ని సంపాదించడానికి ఎంపీడీవో కృషి ఫలితమే 73.64% మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి సాధించింది. ఇలాంటి ఫలితాన్ని బట్టి జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున అందించిన ఉత్తమ అవార్డుల కార్యక్రమానికి మద్నూర్ ఎంపీడీవో రాణి ఎంపిక అయ్యారు.
మద్నూర్ మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీల పరిధిలో 626 ఇండ్లు ప్రతిపాదించగా వీటిలో 613 మందికి ఇల్లు మంజూరు అయ్యాయి. జనవరి 30 నాటికి మండలంలో మార్కౌట్లు వేసిన ఇండ్ల సంఖ్య 544 బేస్ మీట్ లెవెల్ వచ్చినవి 206 రూపు లెవెల్ వచ్చినవి 73 స్లాబ్ లెవెల్ వచ్చినవి175 పూర్తిగా కంప్లీట్ అయినవి ఏడూ ఇండ్ల మంజూరు లో భాగంగా మొత్తం 461 ఇండ్లు ఈ పురోగతిలో కొనసాగడం ఎంపీడీవో కృషిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జనవరి 26న ఉత్తమ అవార్డును ఎంపీడీవో కు అందజేసింది. మద్నూర్ మండల అభివృద్ధి అధికారిగా రాణి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కట్టుబడి పని చేస్తూ మండల ప్రజల్లో మన్ననాలు పొందుతున్నారు.



