Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యపై ఓ మహిళ పెట్రోల్ పోసి తగలబెట్టింది. నగేష్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే గొడవల కారణంగా సుజాత నగేష్ భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో బాధితురాలు తన ఐదు నెలల కుమారుడిని ఎత్తుకొని ఉంది. ఈ ఘటనలో మమత అక్కడికక్కడే మృతి చెందగా.. చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాబును నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సగం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతున్నాడు. నగేశ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. నిందితురాలు సుజాత పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -