మృతులిద్దరూ తెలుగు రాష్ట్రాలవారే..
లద్దాక్: ఎవరెస్టు పర్వతారోహణ ముగించుకొని దిగువకు వస్తున్న క్రమంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఒకరైన సందీప్ ఆరే (46) స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపుర్. అయితే, ఆయన అమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. మరో పర్వతారోహకుడు అరుణ్‌కుమార్ తివారి (53) ఉత్తర్ ప్రదేశ్‌కు చెందినప్పటికీ హైదరాబాద్‌లో స్థిరపడిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే, వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండటం గమనార్హం. సందీప్ ఆరే సమీప బంధువు తెలిపిన వివరాల ప్రకారం.. మే 20వ తేదీన సందీప్ ఎవరెస్టును అధిరోహించాడు. మరుసటి రోజు తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ప్రాణాలు కోల్పోయారు. సాహస యాత్రలంటే ఇష్టపడే సందీప్.. కిలిమంజారో వంటి అనేక పర్వత శిఖరాలను అధిరోహించాడు. అయితే, ఆయన తల్లిదండ్రులకు మాత్రం ఈ యాత్రలంటే ఇష్టం లేదని సమాచారం.
ఎవరెస్టుపై వందేమాతరం
ఓ ఐటీ కంపెనీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అరుణ్‌కుమార్ తివారికి పర్వతారోహణలో ఎంతో అనుభవముంది. రష్యా, అమెరికా, అర్జెంటీనాల్లోని ఎత్తైన పర్వతాలను విజయవంతంగా అధిరోహించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాజాగా ఎవరెస్టును అధిరోహించిన తర్వాత కిందకు దిగే క్రమంలో వీరిద్దరు అలసిపోయి ఉండవచ్చని నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రిషి భండారీ పేర్కొన్నారు. వారి గైడ్‌లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారిని కాపాడలేకపోయారని చెప్పారు. వీరిద్దరి మృతదేహాలను కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు
ఎవరెస్టు యాత్రలో విషాదం
- Advertisement -
- Advertisement -



