- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఫిబ్రవరి 1న ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి మందిరం నుండి నసుల్రాబాద్ సమీపంలోని నెమ్లి శ్రీ సాయి ఆలయానికి భక్తులు పాదయాత్రగా బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీ సాయి భక్తులు మద్నూరు ఆలయం నుండి నెమలి ఆలయానికి వందల సంఖ్యలో భక్తులు పాదయాత్ర బయలుదేరుతారు. మద్నూర్ నుండి ప్రారంభమై మేనూర్, మొగా ,డోంగ్లి ,కుర్లా, బీర్కూర్, తిమ్మాపూర్, నసురుల్లాబాద్ ,చౌరస్తా మీదుగా నెమలికి చేరుకుంటారు. భక్తులు పాదయాత్రగా వెళ్లే వారికి అక్కడక్కడ ఆయా గ్రామాల ప్రజలు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తారు ప్రతి సంవత్సరం పాదయాత్ర భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
- Advertisement -


