నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని కళాభారతిలో జిల్లా న్యాయ సేవా సంస్థ సహకారంతో మహిళలు, పిల్లల సంరక్షణ, సామాజిక బాధ్యత, బాల్యవివాహాల నిర్మూలన చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్యామ్ కోసి , లీగల్ సర్వీసెస్ అథారిటీ నెంబర్ ప్రెసిడెంట్ నందికొండ నరసింహారావు, సిహెచ్. పంచాక్షరి లు హాజరై బాల్యవివాహాల దుష్పరిణామాలు, చట్టపరమైన చర్యలు, సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతపై ప్రసంగించారు. ఈ సందర్భంగా పోక్సో చట్టం (POCSO Act) , బాల్యవివాహాల రద్దుకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్యవివాహాల నివారణలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు తల్లిదండ్రులు, గ్రామస్థులు, మత పెద్దలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు ( రెవెన్యూ ) విక్టర్, ( లోకల్ బాడీ ) మదన్మోహన్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



