Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లి గంగాధర్  ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సిట్ విచారణకు హాజరుకావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నందుకు నిరసనగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను శనివారం దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ ను విచారించడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ షెట్కర్ బస్వంత్ రావు, మాజీ జడ్పీటీసీ పండరి, గుండూర్ సర్పంచ్ కాశీనాథ్ అప్పా, వసరే రమేష్, విట్టుపటేల్, శివాజీ పటేల్, రవి పటేల్, గజారే రాజు, యువ నాయకులు జి. భాను గౌడ్, సుధాకర్ కౌల్ రమేష్, మొగలయ్య తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -