నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామంలో విద్యుత్ సమస్య లేకుండా చేయడమే ప్రభుత్వం కృషి చేస్తుందని సర్పంచ్ నాగరాజు చెప్పారు. మండలంలోని చిల్వేర్ గ్రామంలో విద్యుత్ ఏ ఈ నరేందర్ గౌడ్ తో కలిసి శనివారం విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాలు పడ్డప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని గ్రామంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని చెప్పారు.
గ్రామంలోని అన్ని వార్డులలో సమస్య లేకుండా పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్ ఏఈ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వము పేదలందరికీ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. విద్యుత్ సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా బిల్లులు కూడా చెల్లించి అధికారులకు సహకరించాలని కోరారు. గ్రామంలో సమస్యలు ఉంటే సర్పంచ్ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ, మోహన్, వార్డు మెంబర్లు, విద్యుత్ అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



