– సీఐ పవన్ కుమార్ రెడ్డి..
నవతెలంగాణ – మొయినాబాద్
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని సీఐ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో కె. కిషోర్ సహకారంతో 21 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి గ్రామస్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. స్వీయారక్షణ కోసం మండలంలో మిగిలిన గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమన్నారు. గ్రామాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తుల సమాచారం, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల సమాచారం పోలీస్ వారికి అందించాలన్నారు. ప్రజలు యువకులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలు పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై నర్సింగ్ రావు పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



