Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డీఆర్‌డీఏ పీడీ వచ్చినా.. కార్యదర్శులు రాలే

డీఆర్‌డీఏ పీడీ వచ్చినా.. కార్యదర్శులు రాలే

- Advertisement -

• సోషల్ ఆడిట్ కు ఆలస్యంగా రావడం పై ఆగ్రహం 
• విధుల నిర్వహణలోనూ నిర్లక్ష్యం 
• రూ.‌1,80,219 లక్షల రికవరీ కోసం ఆదేశాలు 
• ఉపాధిలో అవినీతి అక్రమాలను సహించేది లేదు 
• డీఆర్డీఏ పీడీ మధుసూదన్ రాజ్ 
నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సోషల్ ఆడిట్ కు డీఆర్‌డీఏ పీడీ, ఎంపీడీవో లు సమయానికి వచ్చినా కూడా.. కార్యదర్శులు ఆలస్యంగా హాజరయ్యారు. కార్యదర్శులు సమయపాలన పాటించకపోవడం పట్ల డీఆర్‌డీఏ పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో గత సంవత్సరం జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఆడిట్ నివేదికను సామాజిక తనిఖీ బృందం ప్రజల ముందుంచింది. వారం రోజుల పాటు గ్రామ పంచాయతీలో గ్రామసభల ద్వారా సేకరించిన నివేదికను ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా వేదికలో తనిఖీ బృందం వెల్లడించారు.

ఈ తనిఖీల్లో ఒకరి బదులుగా మరోకరు పనులు చేయడం, పని చేయకుండా డబ్బులను కూలీల ఖాతాలో జమ చేయడం, చెట్లు పెట్టకున్నా.. డబ్బుల చెల్లింపు, చేసిన పనుల కొలతల్లో తేడాలు, రోజ్ గారి దివాస్, సంబంధిత రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం, విలేజ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయకపోవడం, లేబర్ బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం, జాబ్ కార్డుల మంజూరిలో నిర్లక్ష్యం, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, ఉపాధి పనులను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించకపోవడం తదితర అంశాలను ప్రజా వేదికలో సామాజిక బృందం తెలియజేసింది. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ మధుసూదన్ రాజ్ మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనుల్లో అవినీతి అక్రమాలను సహించేది లేదని అన్నారు.

కార్యదర్శులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 4వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా మండలంలోని 20 గ్రామ పంచాయతీలో 2024-25 సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం కింద 265 పనులు నిర్వహించినట్లు తెలిపారు. అందుకుగాను రూ. 3.40 కోట్ల పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించగా, రూ. 1,23,044 రికవరీ, అందులో 60,000 పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. బీసీ తండా, ఎల్బీ తండా, కొరిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శులు సామాజిక తనిఖీకి ఆలస్యంగా రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ తండా కార్యదర్శి కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం, ఆడిట్ బృందానికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం తదితర వాటిపై రూ. 25 వేలు, ఇతర కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యంపై పెనాల్టీ విధించారు. అత్యధికంగా పెద్దవంగర 36,198 బీసీ తండా 31,600 పోచంపల్లి గ్రామాల్లో 29269 రూపాయలు రికవరీ వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్టీఎం అజయ్, ఎస్ఆర్పీ రంజిత్, ఈసీ సురేష్, బీఆర్పీలు, పలు శాఖల ఏఈలు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -