ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని,గాంధీ పేరును తొలగించొద్దని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ కీలకపాత్ర పోషించారన్నారు.మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి మహత్మగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ పేరు తీసేసీ వీబీ రాంజీ తో ప్రారంభించాలని చూస్తోందని కేంద్రం వెంటనే పాత పద్ధతిలోనే కొన సాగించాలని డిమాండ్ చేశారు. గాంధీ పేరును తొలగిస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
గాంధీ పేరును తొలగించొద్దు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



