నవతెలంగాణ – ఆర్మూర్
ఐ ఎస్ ఐ గుర్తింపు పొందిన హెల్మెట్ నె ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు శనివారం విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి నుంచి డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నప్పటికీ , హెల్మెట్ లేకుండా ప్రయాణించిన లైసెన్స్ రద్దు చేయబడునని అన్నారు.
18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆర్టీవో కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ ప్రమాదకరమని, జరిమాణాలు, జైలు శిక్షణ కంటే ముందు కుటుంబానికి శోకం మిగిల్చవద్దని అన్నారు. కార్లలో డ్రైవింగ్ చేసేవారితో పాటు, అందులో కూర్చున్న వారు కూడా సీటు బెల్టు ధరించాలని, ఇలా చేయకపోతే ప్రమాద సమయంలో రక్షణగా నిలిచే బెలూన్స్ తే ర్చుకోవని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులచే ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి, ఎయంవిఐ రోహిత్, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.



