- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని హుస్నాబాద్ గల్లీ, అవుటి గల్లిలలో జనవరి 11 తేదీ రాత్రి సమయంలో 5 ఇళ్లలో దొంగతనం చేసిన నేరస్తుడైన అల్లకుంట శ్రీనివాస్ ను అరెస్టు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ శనివారం తెలిపారు. మండలంలోని పిప్రి గ్రామంలో అతని ఇంటి వద్ద అరెస్టు చేసి అతను దొంగిలించిన 6.9 తులాల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులను ఛేదించిన కానిస్టేబుల్ లు కిరణ్ కుమార్, హరీష్, లక్ష్మీనారాయణ లను అభినందించి నగదు రివార్డ్ అందజేసినారు.
- Advertisement -



