నవతెలంగాణ- మునుగోడు
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే ప్రజా బాట లక్ష్యమని జక్కల వారి గూడెం గ్రామ సర్పంచ్ జక్కల రేవతి మహేష్ అన్నారు. శనివారం ఆ గ్రామంలో ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులతో కలిసి గ్రామంలోని ప్రజలను , రైతులను ఇంటింటికి తిరిగి విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలలో తక్షణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
సమస్య పెద్దదైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా బాట కార్యక్రమానికి వచ్చిన విద్యుత్ అధికారులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏడి అశోక్ , ఏ ఈ ఈ నరేందర్ రెడ్డి, లైన్మెన్ వట్టిికోటి శ్రీనివాస్ , హెల్పర్ నరసింహ , ఉప సర్పంచ్ జక్కల పార్వతమ్మ ముత్యాలు , మాజీ సర్పంచ్ జక్కల శ్రీను యాదవ్ , జక్కల మల్లేష్ , వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.



