Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే, తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, అఖిలపక్ష కమిటీ సభ్యులు కోరారు. ఆలేరు పట్టణంలో శనివారం ఆర్యవైశ్య భవనం వద్ద అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆలేరు ఎనిమిది మండలాలతో గతంలో తాలూకాగా ఉందని, ప్రస్తుతం అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోతున్నదని, ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయితే తప్ప వేరే అవకాశం లేదని సభ్యులు పేర్కొన్నారు.

గత ఐదు సంవత్సరాల నుండి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించమని, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి స్థానిక గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని అధికార ప్రకటన చేయడం జరిగినదని తెలిపారు. అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్లా ఐలయ్య అధికారంలోకి వస్తే ,వంద రోజుల్లో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని, మేనిఫెస్టోలో తెలిపారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రెండు 1/2 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. రెవెన్యూ డివిజన్ అమలు  చేస్తామని, ఎమ్మెల్యే  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార సభలో కొలనుపాక గ్రామంలో, నిన్న ఆలేరులో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభలో త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని  చెప్పారని గుర్తు చేశారు.

ప్రతి ఎన్నికల ప్రచార సభలో ప్రకటనలు చేస్తున్నారు తప్ప, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం కృషి చేయడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  ఆలేరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం ఆలేరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కన్వీనర్ పసుపునూరు వీరేశం, కో కన్వీనర్లు రాచకొండ జనార్ధన్ , చెక్క వెంకటేష్, వడ్డెమాను నరేందర్ ,కంతుల శంకర్ , చౌడ బోయిన కనకయ్య, కెమెడీ ఉప్పలయ్య, కల్లెపు అడవయ్య, కామిటికార్ అశోక్ ,మోరి గాడి రమేష్, పాత్రికేయులు ఎండి కుర్షిత్ పాషా, ఎలుగల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -