నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ కార్యాలయ సిబ్బందికి ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన నిజం ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ ఫిజియోథెరఫీ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాం ఇన్స్టిట్యూట్ డాక్టర్ రమేష్ తన సిబ్బందితో కలిసి క్యాంపుకు హాజరైన కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, క్రమం తప్పకుండా ప్రతిరోజు వాకింగ్తో పాటు యోగా, ధ్యానం చేయాలని సూచించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింతా రాజ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఫిజియోథెరపీ క్యాంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



