– బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించండి
– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలుగుదేశం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఓటర్లను కోరారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ 21,22 వ వార్డుల అభ్యర్థుల విజయాన్ని ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగ శేష పద్మ తో కలిసి ఆయన శనివారం ముమ్మరంగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ వార్డు అభ్యర్థులైన ఏలేటి పార్వతి, జుజ్జూరపు శ్రీ రామ్మూర్తి లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో భాగంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని. అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తో సాధ్యమని, మున్సిపాలిటీ పురోభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు, వార్డు ప్రజలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.


