Saturday, January 31, 2026
E-PAPER
Homeఖమ్మం21వ వార్డులో సీపీఐ( ఎం) అభ్యర్థిని ప్రచారం 

21వ వార్డులో సీపీఐ( ఎం) అభ్యర్థిని ప్రచారం 

- Advertisement -

– హాజరైన ఎమ్మెల్యే జారె,నాయకులు పుల్లయ్య 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

నామినేషన్ దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగియడంతో శనివారం అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంపై దృష్టి సారించారు. 21వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థిని తగరం నిర్మల విజయం కాంక్షిస్తూ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు,13 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జూపల్లి రమేష్ బాబు, సీపీఐ (ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు లో దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించగల పనులు అంచనా వేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్థానిక వార్డు బాధ్యులకు సూచించారు.

తాను ఎమ్మెల్యే గా సంబంధిత వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన ఏకరువు పెట్టారు.సాధ్యం అయినంత వరకు వార్డుల అన్నింటినీ సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తానని కౌన్సిలర్ అభ్యర్థి జూపల్లి రమేష్ బాబు హామీ ఇచ్చారు.పొత్తు ధర్మం పాటించి సీపీఐ ( ఎం) ఎన్నికల గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని,సీపీఐ (ఎం) శ్రేణులు చేతి గుర్తు పై ఓటు వేసి గెలిపిస్తారని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్  కానూరి మోహన్ రావు,తగరం ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -