Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్దండలో గద్దర్ జయంతి వేడుకలు..

వెల్దండలో గద్దర్ జయంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ కమిటీ వెల్దండ కమిటీ  ఆధ్వర్యంలో 78వ జయంతి వేడుకలు అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ చిత్రపటం ఏర్పాటు చేసి  పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గద్దర్ విగ్రహ కమిటీ చైర్మన్ చైర్మన్ మాట్లాడుతూ.. పిడిత ప్రజల కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండాపాటలు  మానని అలుపెరగని యోధుడని ఆయన కొనియాడారు.  అణగారిన వర్గాల ప్రజల హక్కులను ఎలుగెత్తి చాటిన కలం అసమానతలు వివక్షకులకు వ్యతిరేకంగా గర్జించిన గళం తన ఆటపాటలతో ప్రజల్లో నిత్యం చైతన్య నింపిన స్ఫూర్తి శిఖరం గద్దర్ అని తెలియజేశారు. గద్దర్ ప్రజా గాయకుడు , ప్రజా ఉద్యమకారుడు తన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -