- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వెల్దండ మండలం గుండాల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత, ఈవో ప్రసాద్ ల సమక్షంలో నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం చేశారు. చైర్మన్ గా మల్లె పళ్లి సందీప్ రెడ్డి, సభ్యులు అరుణ్ నాయక్, మిరియాల పద్మ, అంజయ్య, మల్లేష్ ముదిరాజ్, లింగమయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈవో ప్రసాద్ నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. రానున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పర్వత రెడ్డి , అర్చకులు, కృష్ణయ్య శర్మ, శివకుమార్ చర్మ, నరహరి శర్మ, సురేష్ శర్మ తదితరులు ఉన్నారు.
- Advertisement -



