నవతెలంగాణ – వెల్దండ
మండలంలోని గుండాలలో ఉన్న ఏకలవ్య పాఠశాలలో సీబీఎస్సీకి అనుబంధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో దరఖాస్తు చేయదలచిన వారు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గానికి చెంది ప్రస్తుతం 5 వ తరగతి చుదువుతున్న విద్యార్థులు అర్హులనీ అభ్యర్థులు 31 మార్చి 2013 నుంచి 31 మార్చి 2016 మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు.
దివ్యాంగులైన పిల్లలకు రెండు సంవత్సరాల వయో సడలింపు ఉంటుందని, వారి తల్లితండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షలుగా, గ్రామీణ ప్రాంతాలలో 1. 5 లక్ష లకు మించకూడదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 2026 వరకు ఆన్లైన్ అడ్రస్ tsemrs.gov.in లో అప్లై చేసుకోవాలని తెలిపారు. 6వ,తరగతిలో మొత్తం 60 సీట్లు ఉంటాయి. వీటిలో 30 సీట్లు బాలురకు, 30 సీట్లు బాలికలకు కేటాయించబడ్డాయని తెలియజేశారు. ఇందులో ఎస్టీ విద్యార్థిని,విద్యార్థులకు 90% సీట్లు కేటాయించబడతాయని అన్నారు.



