విజేతలకు బహుమతుల పంపిణీ
నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఉత్సాహంగా సాగిన సీఎం కప్ క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్, ఎంపిడివో శ్రీలేఖ బహుమతులు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, సీఎం కప్ వంటి పోటీలు వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి గొప్ప వేదిక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సి చైర్మన్ రాములు నాయక్, వైస్ చైర్మన్ లక్ష్మన్, ఉప సర్పంచ్ జక్కుల నరేష్, సర్పంచ్ లు సాయిలు, రాకేష్ గౌడ్, ఏ ఎం సి డైరెక్టర్ చంద్ర మౌళి, శ్రీనివాస్, మదన్ లాల్ నాయక్, ఎంపీఓ బిరయ్య, ఎం ఈ ఓ శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన సీఎం కప్ క్రీడలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



