నవతెలంగాణ – బల్మూరు
దశాబ్ద కాలం పాటు పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికుల రోజు ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలు చేయడని వారు తీవ్రంగా వ్యతిరేకించారు ఉన్న చట్టాలు యధావిధిగా ఉంచాలని నాలుగు లేబర్ కోడు రద్దు ఏవరకు కార్మికుల పక్షాన కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు హెచ్చరించారు.
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల పని చేస్తున్న కార్మికులు అచ్చంపేట పట్టణంలో నిరసన ర్యాలీ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు శంకర్, నిరంజన్ కృష్ణ శీను పర్వతాలు బొందయ్య వెంకటయ్య తదితరులు ఉన్నారు.


