Sunday, February 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త ప్రేమకథ

సరికొత్త ప్రేమకథ

- Advertisement -

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో వేలార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌ పై రూపొందుతున్న చిత్రం ‘స్కై’. పృధ్వీ పెరిచర్ల దర్శకుడు. నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న ఈ చిత్రంతో శివ ప్రసాద్‌ అనే కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను దర్శక, నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ఈ సినిమా కంటెంట్‌, సాంగ్స్‌ చూశాను.

కంటెంట్‌ చూస్తుంటే ఈ మూవీలో ఒక ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ చూడబోతున్నామని తెలుస్తోంది. సాంగ్స్‌ చాలా బాగున్నాయి. రసూల్‌ ఎల్లోర్‌ విజువల్స్‌ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘హార్ట్‌ టచింగ్‌ ఎమోషన్స్‌ ఉన్న ఒక కొత్త ప్రేమ కథను మా మూవీలో మీరంతా చూడబోతున్నారు’ అని ప్రొడ్యూసర్‌ నాగిరెడ్డి గుంటక చెప్పారు. డైరెక్టర్‌ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ, ‘సినిమా షూటింగ్‌కు ముందే అన్ని సాంగ్స్‌ రెడీ చేసి పెట్టుకున్నాం. డీవోపీ రసూల్‌ ఇచ్చిన సజెషన్స్‌తో సినిమాను అనుకున్న టైమ్‌లో కంఫర్ట్‌గా కంప్లీట్‌ చేయగలిగాం’ అని తెలిపారు. ‘ఈ సినిమా ద్వారా నేను హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. థియేట్రికల్‌గా మంచి సక్సెస్‌ ఇస్తారని కోరుకుంటున్నా’ అని హీరో మురళీ కృష్ణంరాజు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -