హీరోవిశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈనెల 13న థియేటర్లలో అడుగు పెట్టనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా ‘రట్టాటటావ్’ విడుదలైంది. ఆర్కే సినీప్లెక్స్‌లో ఈ గీతావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ,’ఈ సినిమాతో మళ్ళీ ఒకటి నుంచి నా కెరీర్ మొదలుపెడుతున్నాను. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనుదీప్ ప్రత్యేకమైన వ్యక్తి. తనతో పని చేసిన తర్వాత నేను సినిమాని, జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. అనుదీప్ రచన, హాస్యం భిన్నంగా ఉంటుంది.
ఈ సినిమా మీ అందరికీ మంచి అనుభూతిని ఇస్తుంది’ అని తెలిపారు. ”రట్టాటటావ్’ పాటకు మీ నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది నా అభిమాన గీతాల్లో ఒకటిగా మారిపోయింది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. ఆద్యంతం నవ్విస్తుంది’ అని కథానాయిక కయాదు లోహర్ చెప్పారు. దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ, ‘ఈ పాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాని సంతోషంగా చూడొచ్చు. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వులు పంచుతుంది’ అని తెలిపారు. నరేష్, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, రచన: అనుదీప్ కె.వి, మోహన్, కళా దర్శకుడు: జానీ షేక్.
ఆద్యంతం నవ్వించే ‘ఫంకీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



