Sunday, February 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపండగలాంటి సినిమా

పండగలాంటి సినిమా

- Advertisement -

హీరో శివాజీ, హీరోయిన్‌ లయ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్‌ శ్రీరామ్‌ రచన, దర్శకత్వం వహించారు. ఈనెల 12న డైరెక్ట్‌ ఈటీవి విన్‌ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్‌, కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ డేట్‌ అండ్‌ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరో శివాజీ మాట్లాడుతూ,’ఈ కథ విన్న వెంటనే నచ్చింది. ఈటీవీ విన్‌ వాళ్ళకి పంపించాను. ఈ ప్రాజెక్టు నాకు అప్పచెప్పారు.

సుధీర్‌ కొత్త దర్శకుడు అయినప్పటికీ కథను చాలా అద్భుతంగా చెప్పాడు. తను చెప్పిన కథను అద్భుతంగా తీస్తాడని నమ్మకం కూడా ఉంది. సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా కూర్చుని ఒక సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. ఈ సాంగ్‌ 20 సంవత్సరాలు క్రితం విన్నది. వాళ్ళ దగ్గర రైట్స్‌ తీసుకుని కంపోజిషన్‌ చేశాం’ అని అన్నారు. ”మిస్సమ్మ’లో రత్నమాలగా గుర్తు పెట్టుకున్నారు. ఇక నుంచి ఉత్తరని గుర్తు పెట్టుకుంటారు. ఉత్తర నా కెరీర్‌లోనే చాలా స్పెషల్‌ క్యారెక్టర్‌ అవుతుంది. శివాజీకి సినిమా అంటే చాలా ప్యాషన్‌. ఆయన వరుస విజయాలతో ఉన్నారు. ఈ సినిమా కూడా ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుంది’ అని హీరోయిన్‌ లయ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -