Sunday, February 1, 2026
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

బహుమతి
హరీష్‌ : విరామం పోటీలు పెడితే ఎవరు బహుమతి గెలుచుకుంటారు?
సుధాకర్‌ : టీవీ ఛానల్‌ వాళ్లు.

ముందంజ
వివేక్‌ : ఫీజులు వసూలు చేయడంలో ఎవరు ముందంజలో ఉంటారు?
సందీప్‌ : కార్పొరేట్‌ విద్యాసంస్థలు.

పోలిక
వెంకట్‌ : స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుండి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల వాగ్దానాలను పరిశీలిస్తే కామన్‌గా ఉండే అంశం ఏది?
సుందర్‌ : ఊళ్ళలోకి నీళ్లు, రోడ్డు సౌకర్యాలు తెస్తామని చెప్పడం.

ఏది ముందు
భార్య : ఏమండీ! మన వంటింట్లోకి దొంగ దూరాడండీ! నేను చేసిన బిర్యానీ కూడా తినేశాడని అనుమానంగా ఉంది!
భర్త : అయితే మనం ఇప్పుడు పోలీసులని పిలవాలా? ఆంబులెన్సుని పిలవాలా?

లంచ్‌ – డిన్నర్‌
భార్య : ఏమండీ! మిమ్మల్నే! డిన్నర్‌ చేద్దురుగాని రండి.
భర్త : నీ ఇంగ్లీష్‌ ఏడ్చినట్లే ఉంది. ఇది మధ్యాహ్నం. ఇప్పుడు తినేదాన్ని లంచ్‌ అంటారు. రాత్రి తినేదాన్ని డిన్నర్‌ అంటారు.
భార్య : మీ తెలివి మండినట్లే ఉంది. నిన్న రాత్రి మిగిలిందే ఇప్పుడు పెడుతున్నాను.

మెదడున్నవాళ్ళకే…
భార్య : ఏవండీ.. ఇంటి ముందున్న హాస్పిటల్‌లో మెదడు వాపు వ్యాధికి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు.. వెళ్ళి తీసుకుందామండీ…
భర్త : పిచ్చిదానా అవి కేవలం నాలాగ మెదడు ఉన్నవాళ్లకే.. నీకు అక్కర్లేదు.

గుర్తింపు లేదు
స్టూడెంట్‌ : సైలెంట్‌ లెటర్స్‌ ఇంగ్లీషులో మాత్రమే ఉంటాయా, తెలుగులో ఉండవా మాస్టారూ…!
టీచర్‌ : లేదు. తెలుగులో కూడా ఉంటాయి. ఉదాహరణకి కూతురిని అత్తారింటికి పంపే ముందు మామగారు, అల్లుడితో ‘బాబూ జాగ్రత్త’ అని అంటాడు. మధ్యలో ‘నువ్వు’ అనే రెండు అక్షరాలు సైలెంటే..!

ట్రూ ట్రాన్స్‌లేషన్‌
1వ వెంగళప్ప : హౌమ్‌డెలివరీ అంటే ఏంటి?
2వ వెంగళప్ప : ఆసుపత్రిలో కాకుండా, ఇంట్లోనే పురుడు పోసుకోవడం!

కంప్లైంట్‌…
పోలీసు : ఏం జరిగిందమ్మా… ఎవరి మీద కంప్లైంట్‌ ఇవ్వడానికి వచ్చారు?
రాధ : మా పక్కింటావిడ మీద. మా ఇంటి ముందు నేను వేసిన ముగ్గును ఫొటో తీసి, తన ఇంటి ముందు తానే వేసుకున్నట్టుగా ఫేసుబుక్కులో పోస్టు చేసింది. కాపీరైట్‌ చట్టం ప్రకారం కేసు పెట్టాలని వచ్చా.

అలా చేయండి చాలు!
జడ్జి : రేపు ఉదయం నీకు ఉరిశిక్ష వేయబోతున్నాం. నీ చివరి కోరిక ఏంటో చెప్పు!
ఖైదీ : నాకు మెడ దగ్గర నరం పట్టేసింది. తలకిందులుగా ఉరి తీయండి సార్‌.

మర్యాద!
భార్య : ఏమండీ… కారు తాళాలివ్వండి.. కిడ్డీ పార్టీకి వెళ్లాలి.
భర్త : పక్కనే కదే! కారెందుకు…
భార్య : 5 లక్షల కారులో వెళితే, మర్యాద పెరుగుతుంది… అందుకని!
భర్త : అవునా… ఇదిగో ఈ పది రూపాయలు తీసుకో. 50 లక్షల బస్సులో వెళ్లు. మర్యాద ఇంకా ఎక్కువ పెరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -