Sunday, February 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ఐఎఫ్‌ఎస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ ఐఎఫ్‌ఎస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆ సంఘానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షులుగా వినయ్ కుమార్‌, ఉపాధ్యక్షునిగా, రత్నాకర్‌ జౌహరీ బాధ్యతలు స్వీకరించారు. కార్యదర్శిగా డాక్టర్‌ ప్రియాంక వర్గీస్‌ను, సంయుక్త కార్యదర్శిగా రంజిత్‌ నాయక్‌, కోశాధికారిగా బి.ప్రవీణ ఎన్నికైన వారిలో ఉన్నారు. అటవీ సంరక్షణకు సంబంధించిన విధులతో పాటు అధికారుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఎన్నికైన సభ్యులకు అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారిణి డాక్టర్‌ సి.సువర్ణ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -