Sunday, February 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎప్‌స్టీన్‌ తాజా ఫైల్స్‌లో పలువురు ప్రముఖుల పేర్లు

ఎప్‌స్టీన్‌ తాజా ఫైల్స్‌లో పలువురు ప్రముఖుల పేర్లు

- Advertisement -

జాబితాలో ట్రంప్‌, గేట్స్‌, మస్క్‌
చర్చకు దారి తీస్తున్న పలు ఈమెయిల్స్‌
ఆరోపణలే.. ధృవీకరణ కాలేదు : న్యాయ శాఖ
వాషింగ్టన్‌ :
అమెరికాలో తీవ్ర సంచలనంగా మారిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ చర్చనీయాంశంగా మారుతున్నాయి. అమెరికా రాజకీయ, కార్పొరేట్‌, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. శిక్ష అనుభవించి, మరణించిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తాజాగా విడుదలైన పత్రాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పలువురు ప్రముఖుల పేర్లను ప్రస్తావించాయి. అయితే, ఈ పత్రాల్లో పేర్కొన్న ఆరోపణలు ఇప్పటి వరకు ధృవీకరించబడలేదనీ, ఎవరి పైనా అధికారికంగా నేరారోపణలు నమోదు కాలేదని న్యాయ శాఖ స్పష్టం చేసింది.
ఈ పత్రాల్లో ట్రంప్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, టెస్లా-స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌, బ్రిటిష్‌ వ్యాపారవేత్త రిచర్డ్‌ బ్రాన్సన్‌, అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హౌవర్డ్‌ లుట్నిక్‌ తదితరుల పేర్లు ప్రస్తావించబడ్డాయి.

డోనాల్డ్‌ ట్రంప్‌
పత్రాల్లో ట్రంప్‌నకు సంబంధించిన కొన్ని లైంగికదాడి ఆరోపణల జాబితా ఉందని పేర్కొన బడింది. ఇవి ఎక్కువగా అజ్ఞాత కాలర్లు, ధృవీకరణ లేని సూచనల ఆధారంగా ఎఫ్‌బీఐ నేషనల్‌ థ్రెట్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌కు చేరినవని తెలుస్తోంది. వాటిలో కొన్ని రెండో వ్యక్తుల ద్వారా వచ్చిన సమాచారం కాగా.. అనేక ఆరోపణలు విశ్వసనీయత లేనివిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ పత్రాల విడుదల సందర్భంగా అమెరికా న్యాయ శాఖ ప్రకటన చేస్తూ.. 2020 ఎన్నికలకు ముందు ట్రంప్‌పై ఉద్దేశపూర్వకంగా సమర్పించిన అసత్య, సంచలన ఆరోపణలు ఇందులో ఉన్నాయనీ, అవి పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది.

బిల్‌గేట్స్‌
పత్రాల్లో ఉన్న ఒక డ్రాఫ్ట్‌ ఈమెయిల్‌లో.. బిల్‌ గేట్స్‌ వివాహేతర సంబంధాల్లో ఉన్నారని ఎప్‌స్టీన్‌ ఆరోపించినట్టు ఉంది. ఆ మెయిల్‌లో బిల్‌గేట్స్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై ఎప్‌స్టీన్‌ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొనబడింది. అయితే ఇవన్నీ ఎప్‌స్టీన్‌ చేసిన వ్యాఖ్యలే తప్పితే అధికారికంగా నిర్ధారితమైన ఆరోపణలు కావని అధికారులు అంటున్నారు.

రిచర్డ్‌ బ్రాన్సన్‌
ఎప్‌స్టీన్‌, బ్రాన్సన్‌ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్టు ఈమెయిల్‌ సంభాషణలు సూచిస్తున్నాయి. 2013 సెప్టెంబర్‌లో పంపిన ఒక మెయిల్‌లో.. బ్రాన్స్‌న్‌ ఎప్‌స్టీన్‌ను మళ్లీ కలవాలని ఆసక్తి వ్యక్తం చేసినట్టు ఉంది. ఈమెయిల్స్‌ కూడా సంబంధాల ప్రస్తావన వరకే పరిమితమయ్యాయి.

ఎలాన్‌ మస్క్‌
ఎప్‌స్టీన్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య 2012లో జరిగిన ఈమెయిల్‌ సంభాషణలు పత్రాల్లో ఉన్నాయి. ఒక మెయిల్‌లో ఎప్‌స్టీన్‌ తన ఐలాండ్‌కు రావాలన్న అం శాన్ని ప్రస్తావించగా.. మస్క్‌ దానికి సమాధానం ఇచ్చి నట్టు రికార్డులు చూపుతున్నాయి. అయితే, ఇవీ ఎలాం టి నేరానికీ రుజువుకాదని అధికారులంటున్నారు.

ఆండ్రూ మౌంట్‌బాటెన్‌
బ్రిటన్‌కు చెందిన మాజీ యువరాజు ఆండ్రూ మాంట్‌బాటెన్‌.. 2010లో లండన్‌ పర్యటన సంద ర్భంగా ఎప్‌స్టీన్‌ను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు ఆహ్వానిం చినట్టు ఒక ఈమెయిల్‌ ద్వారా వెల్లడైంది. ఈ సంభాషణల్లో గోప్యతకు సంబంధించిన వ్యాఖ్యలు ఉన్నట్టు పత్రాల్లో ఉంది.

హౌవర్డ్‌ లుట్నిక్‌
ప్రస్తుతం అమెరికా వాణిజ్య శాఖమంత్రిగా ఉన్న హౌవర్డ్‌ లుట్నిక్‌.. ఎప్‌స్టీన్‌తో కలిసి భోజనం చేయా లన్న ప్రణాళికలు వేసుకున్నట్టు ఈమెయిల్స్‌లో ప్రస్తావన ఉంది. 2012లో ఎప్‌స్టీన్‌.. కరేబియన్‌ దీవిలో కలవాలన్న విషయంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

స్టీవ్‌ టిష్‌
హాలీవుడ్‌ నిర్మాత, న్యూయార్క్‌ జెయింట్స్‌ ఫుట్‌బాల్‌ జట్టు సహ యజమాని స్టీవ్‌ టిష్‌కు సంబంధించిన మెయిల్స్‌లో ఎప్‌స్టీన్‌ ఆయనను పలువురు మహిళలతో పరిచయం చేసినట్టు సూచనలు ఉన్నాయి. ఒక మెయిల్‌లో మహిళ గురించి ఎప్‌స్టీన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా పత్రాల్లో ఉన్నాయి. మొత్తంగా ఈ తాజా ఫైల్స్‌ విడుదలతో అనేక మంది ప్రముఖుల పేర్లు మరోసారి చర్చకు వచ్చినట్టయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -