Sunday, February 1, 2026
E-PAPER
Homeబీజినెస్చివరి రోజూ పోటెత్తిన సందర్శకులు

చివరి రోజూ పోటెత్తిన సందర్శకులు

- Advertisement -

ముగిసిన వింగ్స్‌ ఇండియా ప్రదర్శన
నవ తెలంగాణ – బిజినెస్‌ బ్యూరో

హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన వింగ్స్‌ ఇండియా 2026 శనివారంతో ముగిసింది. ఆసియాలోనే అతిపెద్ద సివిల్‌ ఏవియేషన్‌ ఎగ్జిబిషన్‌గా నిలిచిన ఈ ఈవెంట్‌కు గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్పందన లభించింది. చివరి రెండు రోజుల్లోనే 70,000 మందికి సందర్శకులు హాజరయ్యారు. 75,000 మంది బిజినెస్‌ విజిటర్లు పాల్గొన్నారు. 150కి పైగా అంతర్జాతీయ, దేశీయ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. 30కి పైగా విమానాలను ప్రదర్శించారు. ముఖ్యంగా సూర్య కిరణ్‌ ఎరోబాటిక్‌ టీమ్‌, మార్క్‌ జెఫరీస్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాసా ఎయిర్‌, ఎయిర్‌బస్‌, బోయింగ్‌, డస్సాల్ట్‌ ఏవియేషన్‌, ఎంబ్రేయర్‌,: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను, విమానాలను ఇక్కడ ప్రదర్శించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -