- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి సిట్ బృందం చేరుకుంది. ఆయన నివాసంలోని రెండో ఫ్లోర్‌లో సిట్ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు హరీష్, కేటీఆర్, సంతోష్‌లకు మాత్రమే అనుమతినిచ్చారు. అధికారులు విచారణను వీడియో రికార్డు చేయనున్నారు.
- Advertisement -



