నవతెలంగాణ – ఆలేరు
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్ కు సిట్ విచారణ కోసం నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ లబోదిబోమనడం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ ఛానల్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నవతెలంగాణతో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అప్పటి ముఖ్యమంత్రి కే సీ ఆర్ అనుమతి తోనే ఇజ్రాయిల్ నుండి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెలంగాణకు వచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు అన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచులో సీసీ కెమెరాలు బంద్ చేసి పరికరాలు ఫైల్స్ చేసి మూసి నదిలో వికారాబాద్ అడుగుల వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పింకీలు చెప్పాలన్నారు.
ఆధారాలు లేకుండా చేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంటూ డ్రామాలకు తెర లేపడం సిగ్గుచేటు అన్నారు. ప్రతిపక్ష నాయకులు అధికారులు సొంత బిడ్డ అల్లుడు ఫోన్ ట్యాప్ జరిగాయి అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీని ప్రగతిభవన్ గేట్ బయట నుండి లోపటికి రానీయకుండా చేసినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అన్నారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ని శోభ పెట్టి మంత్రివర్గం నుండి భర్త రఫ్ చేసేటప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదన్నారు.టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనే పదం తీసేసి బి ఆర్ ఎస్ పార్టీ గా మారిందని తెలంగాణ పదం ఉచ్చరించే హక్కు లేకుండా చేసుకుందన్నారు.నిరసనలతో తెలంగాణ ప్రజానీకాన్ని పక్కదారి పట్టించేందుకు చేస్తున్న కేటీఆర్ ప్రయత్నాలను ప్రజలు ఎండగట్టాలన్నారు.



