Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పండి.. అంబేడ్కర్‌కు చల్లా ధర్మారెడ్డి వినతి!

రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పండి.. అంబేడ్కర్‌కు చల్లా ధర్మారెడ్డి వినతి!

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
రాజ్యాంగంపై కనీస అవగాహన లేకుండా, కక్షపూరిత రాజకీయాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. ఆదివారం పరకాల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు.

 ప్రజా సమస్యలను గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి, తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ తెచ్చిన నాయకుడిని టార్గెట్ చేయడం అంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అవమానించడమేనని చల్లా స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు యువజన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -