Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పింఛన్ పెంపు ఎప్పుడో.?

పింఛన్ పెంపు ఎప్పుడో.?

- Advertisement -

ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

తాము అధికారంలోకి వచ్చిన వెంటే ఆసరా పింఛన్లను పెంచుతామని కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్ల పెంపు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, డయాలసిస్ పే షెంట్లకు నెలకు రూ.2016ల పింఛన్ అందించింది. తమను గెలిపిస్తే, అధికారంలోకి వచ్చిన వెంటనే వీరికి పింఛన్ ను రూ.4000 లకు పెంచుతామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. దివ్యాంగుల పింఛన్ ను రూ.6000 చేస్తామని ప్రకటించింది.కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వరుస ఎన్నికలు రావడంతోనే కొంత ఆలస్యం జరిగిందని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. పిం ఛన్ పెంచాలని లబ్దిదారులు కోరుతున్నారు.పింఛన్లు పెంచేందుకు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా పింఛన్ల పెంపునకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు, ప్రతిపాదనలు ప్రభుత్వం చేయలేదు. ఈ ఏడాది నిర్వహించే బడ్జెట్ సమావేశంలో పింఛన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని లబ్దిదారులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లుచేస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ కింద రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పథకాలు అమలవుతున్నాయి. అయితే పింఛన్ పెంపు కూడా చేయా లని లబ్దిదారులు కోరుతున్నారు.

మండలంలో ఇలా..
మండలంలో వృధ్యాప్య 1194,వితంతు 1525,వికలాంగులు 530,గితాకార్మికులు 66,చేనేత8,ఒంటరి 26,మొత్తం 3,855 మంది మంది పింఛన్ దారులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరికి రూ. 2016లు నెల నెలా పింఛన్ అందుతుండగా, దివ్యాoగులకు రూ.3016 వేలు అందుతోంది.కొత్తగా పింఛన్ కోసం దాదాపు  వెయ్యి మంది ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. పింఛన్ పెంచితే మండలంలో దాదాపు రూ.5 కోట్లకు పైగా మరింత భారం పడనుంది.

పింఛన్లు పెంచండి..లబ్ధిదారులు
పింఛన్లు పెంచాలి. కాంగ్రెస్ పార్టీ పెంచుతామని చెప్పింది. ప్రస్తుతం అధికారంలో ఉంది.సీఎం రేవంత్ రెడ్డి పింఛన్లు పెంచాలి. పెరిగిన నిత్యావర ధరలతో ఏమీ కొనలేని పరిస్థితి నెలకొంది. పించన్ పెంచితే కొంత ఆసరాగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -