నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం బీటీ రోడ్డు, నేడు పాలించిన ప్రభుత్వాలు వేయకపోవడంతో మూడేళ్లుగా రోడ్డు పనులు నిలిచిపోయాయి. మహ్మదాబాద్ లో నివసిస్తున్న ప్రజలు జుక్కల్ మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం రావాలంటే ఈ దారి గుండానే రావాలి. గత ప్రభుత్వంలో రోడ్డు పనులు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. అంతలోని ఎన్నిల కోడ్ రావడంతో బీటి రోడ్డు అర్ధాంతరంగా నిలిచిపోయింది.
స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే కూడా రోడ్డు పనులపై దృష్టి సారించకపోవడంతో ఈ రోడ్డు పునరుద్ధరణకు నోచుకోలేకపోయింది. నాటినుండి నేటి వరకు ఈ రోడ్డుకు బీటీ పనులు చేయకపోవడం వలన మహమ్మదాబాద్ గ్రామస్తులతో పాటు అటువైపునుండి రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులు , విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆశ్చర్యకర విషయమేంటంటే అరకిలోమీటర్ బీటీ రోడ్డు మాత్రమే పెండింగ్ లో ఉంది. దీన్ని కూడా స్థానిక అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం లేదు.
ఈ అసంపూర్తి పనుల వలన రోడ్డుపై గుంతలు, కంకర తేలి దుమ్ము దూళితోపాటు వాహన దారులకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి జనాలు ఆస్పత్రుల పాలయ్యారు. వెంటనే మహ్మదాబాద్ బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానిక ప్రజలు అధికారులను, రాజకీయ నాయకులను వేడుకుంటున్నారు.



