- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
ఫోన్ ట్యాంపింగ్ కేసులో విచారణకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నోటీసులు జారీ చేసినందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర,జిల్లా మండల నాయకులు,బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



